Jagan: "వైసీపీ హయాంలో రైతులకు రాజుగా బతకడం!" 1 y ago
ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదన్నారు వైఎస్ జగన్. వైసీపీ హయాంలో రైతులకు పెట్టుబడి సాయం చేసి అండగా నిలిచామన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు కష్టాలు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరన్నారు. రైతుల దీన స్థితికి ప్రభుత్వమే కారణమన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులు రాజుగా బతికారని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్లో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదన్నారు జగన్. వైసీపీ హయాంలో వ్యవసాయం పండుగలా జరిగిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నామన్నారు. మిర్చి రైతుల అవస్థలు చంద్రబాబుకు పట్టడం లేదని మండిపడ్డారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
రైతులను దళారులకు అమ్మే పరిస్థితి వచ్చిందని జగన్ పేర్కొన్నారు. మిర్చి రైతులకు కనీసం రూ. 11 వేలు కూడా గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. ఈ ఏడాది పంటల దిగుబడి కూడా పడిపోయిందన్నారు. ఎరువులు బ్లాక్ లో కొనాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. పెట్టుబడి సాయం ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు.
సీఎం చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు వైఎస్ జగన్. రైతులకు సున్నా వడ్డీ ఇవ్వడం లేదన్నారు. వైసీపీ హయాంలో గిట్టుబాటు ధర రూ. 21 వేల నుంచి రూ. 27 వరకు వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు కనీసం రూ. 11 వేలకు కూడా కొనే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతకు భద్రత కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదని పేర్కొన్నారు. మీరు విపక్షంలో ఉన్నప్పుడు ఇలానే భద్రత తీసేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మీరు చేస్తోంది సరైన పద్ధతి కాదన్నారు.